Header Banner

బ్యాడ్ న్యూస్.. ఆర్‌సీబీ X కేకేఆర్ మ్యాచ్‌ రద్దు? ఈ మ్యాచ్ ఓడినా లేక గెలిచినా..

  Sat May 17, 2025 12:33        Sports

పాక్‌, భార‌త్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్‌ 2025 వారం రోజుల పాటు ఆగిపోయిన‌ విష‌యం తెలిసిందే. అయితే, ఈరోజు నుంచి ఐపీఎల్ రీస్టార్ట్ అవుతోంది. మిగిలిన లీగ్ మ్యాచ్‌ల‌ను ఆరు న‌గ‌రాల్లో నిర్వ‌హించాల‌ని బీసీసీఐ నిర్ణ‌యించింది. ఈరోజు రాత్రి 7.30 గంట‌ల‌కు బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌), రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) మ‌ధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ పునఃప్రారంభం కానుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వ‌రుణుడి గండం పొంచి ఉంది. ఈ మేర‌కు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. వ‌ర్షం కార‌ణంగా ఆట మొత్తం తుడిచిపెట్టుకునిపోయే ప్ర‌మాద‌మూ ఉన్న‌ట్లు స‌మాచారం.

 

ఇది కూడా చదవండి: జగన్ పడగ నేడు.. విలువల నడక! నాడు - నేడుతో నేను తెచ్చిన మార్పు ఇదే!

 

కానీ, చిన్న‌స్వామి స్టేడియంలో అత్యున్న డ్రైనేజీ వ్య‌వ‌స్థ ఉండ‌టం అనేది కాస్త ఊర‌ట‌నిచ్చే విష‌యం. ఈ మ్యాచ్‌కు వ‌రుణుడు క‌రుణిస్తే ఐపీఎల్ రీస్టార్ట్ ఘ‌నంగా జరుగుతుంది. అందుకే అభిమానులు వ‌రుణ దేవుడిని ఇవాళ క‌రుణించాల‌ని ప్రార్థిస్తున్నారు. ఇదిలాఉంటే.. ఈ సీజ‌న్‌లో ఆర్‌సీబీ అద్భుతంగా రాణిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు ఆ జ‌ట్టు 11 మ్యాచులాడి 8 విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానంలో ఉంది. ఇవాళ్టి మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్స్‌కు చేరిన తొలిజ‌ట్టుగా నిలుస్తుంది. మ‌రోవైపు ఆడిన 12 మ్యాచుల్లో కేకేఆర్‌ ఐదు విజ‌యాలు న‌మోదు చేసింది. పాయింట్ల ప‌ట్టిక‌లో ఆరో స్థానంలో ఉంది. ఇక‌, ఈ మ్యాచ్ ఓడినా లేక గెలిచినా ఆ జ‌ట్టుకు ఎలాంటి ఉప‌యోగం లేద‌నే చెప్పాలి. ఎందుకంటే ఇప్ప‌టికే కేకేఆర్ ప్లేఆఫ్స్ అవ‌కాశాల‌ను దాదాపు కోల్పోయింది.    

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఈ ఒక్క పని చేయండి చాలు.. మీ ఇంట్లో ఎలాంటి ఆస్తి తగాదాలు ఉండవు - సరైన అథెంటికేషన్‌ లేకపోతే!

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Sports #teamindia